11-03-2025 10:04:33 AM
హైదరాబాద్: చెన్నైలోని టీటీడీ ఆలయం(TTD Temple)లోని పరకామని లెక్కింపులో అవకతవకలు చోటుచేసుకున్నాయి. శ్రీవారి(Sri Venkateswara Swamy Temple)కి సమర్పించిన హుండీ కానుకల్లో టీటీడీ ఉద్యోగి(TTD Employee) చేతివాటం చూపించాడు. భక్తులు సమర్పించిన విదేశీ కరెన్సీ(Foreign currency)ని ఉద్యోగి కృష్ణ కుమార్ దారి మళ్లించాడు. సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ ను టీటీడీ ఈవో శ్యామలరావు సస్పెండ్ చేశారు. విజిలెన్స్ విభాగం నివేదిక ఆధారంగా కృష్ణకుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది.