calender_icon.png 1 November, 2024 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీటీడీలో మనోళ్లు ఉండాలి

07-07-2024 01:42:09 AM

  1. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాలి 
  2. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): తిరుమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి కోరాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర్‌రావు లేఖలో సూచించారు. కోట్లాది మంది భక్తులు పూజించే తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులకు వసతి, దర్శనానికి ప్రజాప్రతినిధుల లేఖలకు ప్రాముఖ్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయడుకు విజ్ఞప్తి చేయాలన్నారు. అదేవిధంగా టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం ఇవ్వాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబుతో మాట్లాడాలని పేర్కొన్నారు. దీంతో పాటు దేవదాయ భూములకు సంబంధించిన అంశాలపైనా చర్చించాలన్నారు. టీటీడీ నుండి తెలంగాణలోని ఆలయాలకు రూ.10లక్షల నిధులు రావాలన్నారు.