calender_icon.png 6 February, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందూయేతర ఉద్యోగులకు టీటీడీ షాక్

06-02-2025 01:04:08 AM

  1. 18 మందిపై క్రమశిక్షణ చర్యలు
  2. ఇతర విభాగాలకు బదిలీ చేయాలని నిర్ణయం
  3. వీఆర్‌ఎస్‌కు అనుమతి

తిరుమల, ఫిబ్రవరి 5: హిందూయేతర ఉద్యోగులు, సిబ్బందిపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. 1989 ఎండోమెంట్ యాక్ట్ 1060 ప్రకారం.. హిందూమత ఆచారాలు పాటిస్తామని ప్రమాణం చేసి, టీటీడీలో ఉద్యోగం పొందిన కొందరు ఇతర మతాలను అనుసరిస్తున్నట్లు గుర్తించారు.

18 మందిపై క్రమశిక్షణ చర్యలకు టీటీడీ ఆదేశాలిచ్చింది. హిందూ యేతర ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. వీఆర్‌ఎస్ తీసుకునే వారికి అనుమతి ఇవ్వాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు. ఈ మేరకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది.