calender_icon.png 20 September, 2024 | 8:10 PM

ల్యాబ్ పరీక్షల్లో నెయ్యి నాణ్యత లేదని తేలింది

20-09-2024 05:32:47 PM

తిరుమల,(విజయక్రాంతి): తిరుపతి దేవస్థానానికి వచ్చే భక్తులు తిరుమలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. కానీ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ తెల్చిందని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. తమిళనాడు చెందిన ఏఆర్ పుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో తెలిపారు. నెయ్యి కల్తీ పరిక్ష కోసం బయటకు పంపడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసారి అని, 4 ట్యాంకర్లలోని నెయ్యిని 10 ప్రయోగశాలలకు పంపామని శ్యామలరావు వెల్లడించారు. నెయ్యి నాణ్యత నిర్ధరణ కోసం ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపామని, ఎన్డీడీబీ ల్యాబ్ అనేది గుజరాత్ లోని ఆనంద్ లో ఉందన్నారు. దీంతో ల్యాబ్ పరీక్షల్లో నెయ్యి నాణ్యత లేదని తేలిందని ఎన్డీడీబీ ల్యాబ్ వ్యాఖ్యానించారు.

జూలై 6న నెయ్యిని ప్రయోగశాలలకు పంపాం..వారంలో వచ్చిన ల్యాబ్ నివేదికలు నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు తేల్చాయి. 100 పాయింట్ల ఉండాల్సిన నెయ్యి నాణ్యత 20 పాయింట్లే ఉందని, రూ.320 నుంచి 411 ధరకే కిలో నెయ్యి సరఫరా చేశారని టీటీడీ ఈవో తెలిపారు. అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి ఎలా ఇస్తారు?, అని ఆయన ప్రశ్నించారు. నెయ్యి నాణ్యత నిర్ధరణకు తితిదేకు సొంత ప్రయోగశాల లేదన్నారు. నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదని, నాణ్యత నిర్ధరణకు బయట ల్యాబ్స్ పై ఆధారపడాల్సిన పరిస్థితి అని ఈవో సూచించారు. నెయ్యిలో తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామని, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామని టీటీడీ ఈవో వెల్లడించారు. రూ.75 లక్షల విలువైన నెయ్యి నాణ్యత పరికరాలను ఇటీవల ఎన్డీడీబీ విరాళంగ ఇచ్చిందని, ప్రస్తుతం సొంత ల్యాబ్ ఉన్నందున ఇకపై తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు.