09-02-2025 09:55:28 AM
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) స్థానిక (తిరుపతి), ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) భక్తులకు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 11న తిరుమల ఆలయానికి వెళ్లాలనుకునే తిరుపతి స్థానికులకు ఫిబ్రవరి 9న శ్రీవారి దర్శనానికి(Tirumala Tirupati Devasthanams) టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఈ టోకెన్లు తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్(Balaji Nagar Community Hall)లో అందుబాటులో ఉంటాయన్నారు.
ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా తిరుపతి వాసులకు ఫిబ్రవరి మొదటి మంగళవారం నుంచి రెండో మంగళవారం వరకు ప్రత్యేక దర్శనాన్ని టీటీడీ రీషెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, ఎన్నారై భక్తుల కోసం టీటీడీ కీలక అప్ డేట్ ఇచ్చింది. ఎన్నారైలకు కేటాయించిన వీఐపీ బ్రేక్ దర్శన స్లాట్(VIP Break Darshan slot)ల సంఖ్యను రోజుకు 50 నుంచి 100కు పెంచారు. ఎన్నారై భక్తుల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పుతో, 100 మంది ఎన్నారైలు వారి కుటుంబ సభ్యులతో పాటు ఆలయంలో సులభతరమైన, సౌకర్యవంతమైన దర్శన అనుభూతిని పొందనున్నారు. టీటీడీ(TTD) నిర్ణయం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఎన్నారై భక్తులు ఆలయ నిర్వాహకులకు, పాలక మండలికి తమ కృతజ్ఞతలు తెలియజేసారు.