calender_icon.png 21 April, 2025 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిఎస్‌యుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

13-04-2025 07:27:56 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్‌యుటిఎఫ్) 12 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయం వద్ద పతాకావిష్కరణ చేశారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు గుండారపు చక్రపాణి, గుర్రాల రాజావేణు మాట్లాడుతూ అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహ లక్ష్యాలతో పనిచేస్తున్న ఉపాధ్యాయ సంఘం టిఎస్‌యుటిఫ్ అని, హక్కులు, బాధ్యతలు ఉద్యమ నేత్రాలుగా, ప్రాంతాలు, యాజమాన్యాలు, క్యాడర్లు, మతాలు, కులాల అంతరాలను అధిగమించి, ఉపాధ్యాయులందరికీ ఒకే సంఘం అనే చారిత్రక ఆవశ్యకతతో ఆవిర్భవించిందన్నారు.

మహనీయుల త్యాగాల వారసత్వంలో ప్రభుత్వ విద్య అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూ, ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి, ఐక్య ఉద్యమాలకు చిరునామాగా నిలిచిన సంఘం టిఎస్‌యుటిఎఫ్‌ అని అన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమం ధ్యేయంగా ఏర్పడిన సంఘం టిఎస్‌యుటిఎఫ్‌ అని, చదువులో అంతరాలు పోవాలంటే ప్రభుత్వ బడుల ద్వారానే సాధ్యమని, అందుకోసం ప్రభుత్వ బడుల అభివృద్ధికై ప్రతి ఒక్కరం కృషీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు  కిరణ్ కుమార్, జిల్లా కార్యదర్సులు చంద్రమౌళి, నర్సయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ శ్రీధర్, యన్ కృష్ణ మూర్తి, యస్ శంకరయ్య, కె రమేష్ తదితరులు పాల్గొన్నారు.