calender_icon.png 14 April, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా టీఎస్ యూటీఎఫ్ 12వ ఆవిర్భావ దినోత్సవo

13-04-2025 02:03:31 PM

భద్రాచలం, (విజయక్రాంతి): భద్రాచలం పట్టణం(Bhadrachalam town)లోని ప్రాంతీయ కార్యాలయం నందు డివిజన్ స్థాయిలో టీఎస్ యూటీఎఫ్(TSUTF) ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది.  జిల్లా కార్యదర్శి ఎస్ విజయ్ కుమార్  అధ్యక్షతన పతాకావిష్కరణ యుటిఎఫ్ సీనియర్ నాయకులు పి లక్ష్మీనారాయణ  రాష్ట్ర కార్యదర్శి బి. రాజు ముఖ్య అతిథులుగా నిర్వహించడం జరిగింది. తదనంతరం టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్(TSUTF District Audit Committee Convener) ఎం సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది., .. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి బి రాజు  మాట్లాడుతూ, తెలంగాణలో ఉపాధ్యాయ సమస్యల మీద టి ఎస్ యూ టీ ఎఫ్ రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు .టీఎస్ యుటిఎఫ్ పోరాటం వల్లనే ఉపాధ్యాయ సమస్యలు చాలా వరకు సాధించుకున్నామన్నారు.

రానున్న కాలంలో ఉపాధ్యాయ సమస్యలపై సంఘం నిర్వహించే పోరాటాలకు ఉపాధ్యాయులు కదిలి రావాలన్నారు ., ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డి ఏ లు,  పీ ఆర్ సి , పెండింగ్  బిల్లులు, సిపిఎస్ రద్దు,వంటి సమస్యలు వెంటనే నెరవేర్చాలన్నారు. లేకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుంది అన్నారు.వెంటనే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో  ఐటీడీఏ సబ్ కమిటీ కన్వీనర్ టి బాలు, పూర్వా జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వర్లు, పూర్వ జిల్లా కార్యదర్శి సిహెచ్ అనిల్, సీనియర్ నాయకులు రాజ శ్రీనివాస్ , భద్రాచలం అధ్యక్షులు కొమరం శ్రీనివాస్, బూర్గంపాడు ప్రధాన కార్యదర్శి టి రమేష్, భద్రాచలం ఉపాధ్యక్షులు ఎం రమేష్, మండల కార్యదర్శి సైదులు, ప్రసాద్, భారతి,కరుణకుమార్ ,దుమ్ముగూడెం ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ సిహెచ్ శ్రీనివాస్, భద్రాచలం ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ సిహెచ్ శ్రీనివాసరావు, సీనియర్ రిటైర్డ్ నాయకులు జీవి సత్యనారాయణ, పి విజయబాబు, జీ వెంకటేశ్వర్లు, బూర్గంపాడు మహిళా కార్యదర్శి అనిత, భద్రాచలం కార్యదర్శి టి పూజిత తదితరులు పాల్గొనడం జరిగింది.