కామారెడ్డి జిల్లాలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. సోమవారం నాడు కామారెడ్డి నుండి నిజాంసాగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు.