29-03-2025 06:16:28 PM
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీ.ఎస్.జే.యూ మీడియా ఇంచార్జీ కార్కురి సతీష్ ఇటీవల ప్రమాదవశాత్తు కోతుల దాడిలో గాయపడ్డాడు. విషయం తెలుకున్న టీ.ఎస్.జే.యూ నాయకులు శనివారం సతీష్ ను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో టీ.ఎస్. జే.యూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంతోష్, ప్రధాన కార్యదర్శి దొమ్మాటి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు గట్టు రవీందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.