calender_icon.png 15 November, 2024 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత, వాహనాల ఫిట్‏నెస్​పై కఠినంగా వ్యవహరిస్తాం : మంత్రి పొన్నం

08-09-2024 06:46:23 PM

హైదరాబాద్: తెలంగాణ రవాణా శాఖ సాంకేతిక అధికారుల సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 6,936 డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేశామని పొన్నం పేర్కొన్నారు. రోడ్డు భద్రత, వాహనాల ఫిట్ నెస్ పై కఠినంగా వ్యవహరిస్తామని, రవాణా శాఖలోని పెండింగ్ లో ఉన్న పదోన్నతులు, సమస్యలు పరిష్కారిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ సిబ్బందిపై వేధింపులు లేకుండా చూస్తామని మంత్రి పొన్నం తెలిపారు.