calender_icon.png 1 November, 2024 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబంధనల మేరకే బకాయిల వసూలు

12-05-2024 01:15:13 AM

బీఆర్‌ఎస్ నేత జీవన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన టీఎస్ ఆర్టీసీ

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): నిబంధనల మేరకే బకాయి లు వసూలు చేస్తున్నామని టీఎస్ ఆర్టీసీ స్పష్టం చేసింది. టీఎస్ ఆర్టీసీకి బీఆర్‌ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన ఓ సంస్థ నుంచి రావాల్సిన బకాయిల విషయంలో ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై టీఎస్ ఆర్టీసీ స్పందిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ, అధికారులపై జీవన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, వాటిని తీవ్రం గా ఖండిస్తున్నట్లు వెల్లడించింది. అద్దె బకాయిల విషయంలో లీజ్ ఒప్పందం, హైకోర్టు ఆదేశాల ప్రకారమే సంస్థ నడుచుకుంటుందని తెలిపింది. బకాయిలు చెల్లించాలని గత ఐదేళ్లుగా 20కిపైగా నోటీసులను జారీ చేసినా, తమకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పడంలో ఏ మాత్రం నిజం లేదని 

ప్రకటించింది.