17-04-2025 08:15:26 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంను బెల్లంపల్లి నియోజకవర్గ జర్నలిస్టులకు అమలు చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు గురువారం టీఎస్ జేయు ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో అనేకమంది పేద మద్య తరగతికి చెందిన జర్నలిస్టులు వున్నారని ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులు ప్రభుత్వ పథకాలకు అర్హులు అయినప్పటికీ ఎలాంటి లబ్ధి చేకూరడం లేదని దీంతో జర్నలిస్టు కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అందువల్ల రాజీవ్ యువ వికాసం పథకంను జర్నలిస్టులకు ఖచ్చితంగా లబ్ధి చేకూరెలా చెయ్యాలని TSJU మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రాజు పటేల్, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ లు ఎమ్మెల్యే వినోద్ దృష్టికి తీసుకెళ్లారు. బెల్లంపల్లి నియోజకవర్గ జర్నలిస్టుల బాధలు తనకు తెలుసునని రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా జర్నలిస్టులకు లబ్ధి చేకూరెలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని టీఎస్ జేయు ప్రతినిధులకు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ హామీ ఇచ్చారు.