calender_icon.png 19 January, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంధులకు చూపందించే ప్రయత్నం!

19-09-2024 03:25:44 AM

అరుదైన ప్రయోగానికి సిద్ధమైన మస్క్

న్యూయార్క్, సెప్టెంబర్ 18: టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్ స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్ అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది. పుట్టుకతో చూపులేని వారు సామాన్య మానవుల్లాగా ప్రపంచాన్నీ వీక్షించేందుకు వీలుగా ఓ పరికరాన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ పరికరం తయారీకి జరిగే ప్రయోగాలకు సైతం న్యూరాలింక్ యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి పొందింది. “న్యూరాలింక్ తయారుచేసే బ్లుండ్‌సెట్ డివైజ్ అంధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రయోగం ద్వారా రెండు కళ్లతో చూసే ఛాన్స్ లేకున్నా ఆప్టిక్ నరానికి అనుసంధానం చేసిన బ్లుండ్ సైట్ డివైజ్ ద్వారా ప్రపంచాన్ని చూసే వీలుంటుంది. ఈ పరికరాన్ని వాడిన మొదట్లో దృష్టి సామర్థ్యం కొంత తక్కువగా ఉన్నా, తర్వాత సహజమైన కంటిచూపు కన్నా మెరుగ్గా పనిచేస్తుంది. ప్రభావవంతమైన అతినీలలోహిత కిరణాలను కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పరికరం సాయంతో వీక్షించొచ్చు” అని ఎలన్ మస్క్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.