calender_icon.png 26 December, 2024 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా చేపలు పట్టేందుకు యత్నం

02-11-2024 02:32:50 AM

నాగర్‌కర్నూల్, నవంబర్ 1(విజయక్రాంతి):  దీపావళి రోజు కొందరు మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా కేసరి సముద్రం చెరువులో చేపలు పట్టిన విషయం తెలుసుకున్న జిల్లా మత్స్యశాఖ సహాయ పర్యవేక్షణ అధికారి గంగారాం శుక్రవారం కేసరిసముద్రం చెరువును క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. చేపలు పట్టేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను పెట్టి, కొందరు గుడారాలు ఏర్పాటు చేశారని,  చెరువు ఒడ్డున నాటు పడవలను గుర్తంచారు. అనతంరం స్థానికులను విచారించారు.

పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన తెలిపారు. చెరువులో కొందరు దుండగులు చెరువును అర్రాస్ పాడి అక్రమంగా చేపలు పాటడుతున్నట్లు గత అక్టోబర్ నెల 29న ‘అర్రాజ్ పాడి అప్పజెప్పేస్తున్రు’ అనే శీర్షికన ‘విజయక్రాంతి’లో కథనం ప్రచురితమైంది. అలాగే చేపల చెరువులో బీఆర్‌ఎస్ నేతల అక్రమాలపై గత నెల 4న చెరువులపై ‘గులాబీ రాబందులు’ అనే శీర్షికన మరో కథనం ప్రచురించింది. కథనాలపై ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి స్పందించారు. ఈమేరకు జిల్లా అధికారులతో మాట్లాడి నిజమైన మత్స్యకారులకు న్యాయం చేయాలని సూచించారు.

దీంతో జిల్లామత్స్యశాఖ అధికారులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపలు పట్టొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ.. కొందరు అక్రమార్కులు తమ పద్ధతి మార్చుకోవడం లేదు.