- ఏ రూపంలోనైనా వెలుగులోకి వస్తుంది
- ‘ది సబర్మతి రిపోర్ట్’పై ప్రధాని మోదీ ప్రశంస
న్యూఢిల్లీ, నవంబర్ 18: ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ట్రయిలర్‌ను ఆదివారం ఓ నెటిజన్ ప్రధాని కి ట్యాగ్ చేస్తూ పెట్టిన పోస్ట్‌పై మోదీ స్పందించారు. ‘ఈ సినిమా ద్వారా నిజయం బయటకు వస్తుంది అన్నా రు. కల్పితిమైన కథనాలు కొంత కాలానికే పరిమితమవుతాయి.
సా మాన్యులకు కూడా అర్ధమయ్యే వి ధంగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూ పొందించారు. 2002 ఫిబ్రవరి 27న గోద్రా రైల్వేస్టేషన్‌లోని సబర్మ తి ఎక్స్‌ప్రెస్ ఎస్‌త కోచ్‌కు కొం దరు దుండగులు నిప్పుపెట్టారు.
ఈ ఘటనలో 59 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఇదే ఘటన అదే ఏడాది గుజరాత్‌లో అల్లర్లకు దారితీసింది. ఈ ఘటనల ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ధీర జ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ పేరు తో సినిమాను రూపొందించారు. 12 ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే, టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా ప్రధాన పాత్రలతో తెరకిక్కిన ఈ సినిమా ఈనెల 15న విడుదలైంది.