గోపిచంద్, శ్రీను వైట్ల కాంబోలో రూపొందిన చిత్రం ‘విశ్వం’. టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ విశ్వం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపిచంద్ మాట్లాడుతూ.. “సినిమా విషయంలో దర్శకుడిని గుడ్డిగా నమ్మాను. మంచి ఫలితం వచ్చింది. నరేశ్, పృథ్వీ ఇలా సినిమాలో పనిచేసిన ప్రతి నటుడిని చాలా ఇబ్బంది పెట్టాను.
వాళ్లంతా సింగిల్ టేక్ ఆర్టిస్టులు. ఇందులో చిన్న పాప చాలా అద్భుతంగా నటించింది” అని తెలిపారు. అనిషా అంబ్రోస్ మాట్లాడుతూ.. “మ్యారేజ్ తర్వాత చేసిన ఫస్ట్ సినిమా ఇది. నా మనసుకి చాలా దగ్గరయింది. రియల్ లైఫ్‌లో నాకు కిడ్ ఉంది. ఇందులో నేను చేసిన పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది” అని పేర్కొన్నారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ.. “నా బలం కామెడీ అని అందరూ చెబుతారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడానికి మదర్ ఎమోషన్, పాప ట్రాక్ చాలా పెద్ద కారణం. గోపి నాకు చాలా సపోర్ట్ గా నిలబడ్డాడు. నరేష్ గొప్ప ఎనర్జీ తో క్యారెక్టర్ చేశారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు నరేశ్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.