సోషల్ మీడియాలో సినీ తారలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ అవుతూనే ఉంటాయి. తాజాగా నిధి అగర్వాల్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది ‘ది రాజాసాబ్’ చిత్రానికి సంబంధించిన లీక్డ్ ఫోటో అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చారు. ఫోటోకు, చిత్రానికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. “అది ‘ది రాజాసాబ్’ లీక్డ్ ఫోటో కాదు. ఇటీవల నేను చేసిన ఒక యాడ్ షూట్‌కు సంబంధించిన ఫోటో. సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లను త్వరలోనే మీకు ఇస్తాం. నన్ను నమ్మండి.
మీ ఎదురు చూపులకు తగిన ప్రతిఫలం త్వరలోనే లభిస్తుంది” అని నిధి అగర్వాల్ తెలిపారు. ప్రభాస్ హీరోగా మారుతి రూపొందిస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. హారర్, రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందుతోంది. ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ , రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఇప్పటి వరకూ పోషించని పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రలో రెండు భిన్న కోణాలుంటాయి. ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.