హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): నమ్మకం, అర్థం చేసుకునే తత్వం అనేవి వివాహానికి మూల స్తంభాలు అని హైకోర్టు అడ్వకేట్ విజేత బొరకటి, ప్రొ.పీ జ్యోతి అన్నారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్‌లో బుధవారం ‘ఉమెన్ ప్రొటెక్షన్ సెల్’, ‘దుర్గా స్రవంతి సంస్థ’, ‘ఆల్ ఇండియా లైనెస్ క్లబ్‘ ఆధ్వర్యంలో కళాశాల డైరెక్టర్, ప్రొ.విజయలక్ష్మి కంతేటి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు.. యువత వివాహానికి సిద్ధమైనపుడు కలిగి ఉండాల్సిన అవగాహన గురించి వివరించారు. భారత న్యాయసంహితలోని వివిధ సెక్షన్ల ఉపయోగాలు, అత్యవసర సమయంలో డయల్ చేయాల్సిన నంబర్ల గురించి తెలిపారు.