10-04-2025 01:38:44 AM
వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, ఏప్రిల్ 9 ( విజయక్రాంతి ):-మెరుగైన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టర్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వసతులు, వైద్య కళాశాల లో సౌకర్యాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సౌకర్యాల మెరుగుపర్చుటకు చర్యలు చేపట్టాలన్నారు. టాయిలెట్ల మరమ్మత్తులు, అవసరమైన క్రొత్త టాయిలెట్ల నిర్మాణంనకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. విభాగాల వారిగా కావాల్సిన సౌకర్యాల నివేదిక ఇవ్వాలన్నారు.
ఓపి గదులు చిన్నవిగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఉన్నట్లు, సరిపోవు విధంగా ప్రత్యామ్నాయ గదులు చూడాలన్నారు. మరో అంతస్తు, లిఫ్ట్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వైద్యాధికారులు సేవాదృక్పథంతో ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రాజేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. కళావతి బాయి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, ఉప జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. సైదులు, వైద్యాధికారులు, వైద్య శాఖ ఇఇ ఉమామహేశ్వర రావు, ఖమ్మం నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ షఫీయుల్లా, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.