28-02-2025 12:49:43 AM
అయినా భవిష్యత్తులో ఎగుమతులు పెరిగే అవకాశం
హైదరాబాద్(విజయక్రాంతి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వాణిజ్య భా గస్వాములైన చైనా, కెనడా, మెక్సికోలాంటి దేశాలపై కొత్తగా సుంకాలు విధించాలని నిర్ణయించడంతో ప్రపంచ వాణిజ్య స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ఈ సుంకాల ప్రభావం భారత్‌పై నేరుగా ప్రభావం చూపనప్పటికీ భారత్ సహా అన్ని దేశాలపైనా ప్రతీకారసుంకాలు విధిస్తానని ట్రంప్ అం టుండడం భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభా వం చూపుతోంది.
ముఖ్యంగా డాలరుతో భారత కరెన్సీ రూపాయి విలువ గణనీయం గా పడిపోయింది. ఆర్థిక అనిశ్చితులు, అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా రూపాయి విలువ మరింత పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. మన దేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో 87 శాతం డాలరుతోనే జరుపుతుండటంతో దిగుమతులు భారంగా మారుతున్నాయి. ఫలితంగా వాణిజ్య లోటు పెరిగిపోనుంది.
ప్రస్తుత టారిఫ్‌ల కారణంగా అమెరికా నుంచి దిగుమతులు తగ్గించుకుని ప్రపంచ దేశాలు భారత్‌లాంటి దేశాల వైపు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే మనదేశం ట్రంప్ సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు మొదలు పెట్టింది. బ్రిటన్, ఈయూతో స్వే చ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడానికి చర్చలు జరుపుతోంది.