మూడీస్ అంచనా
న్యూఢిల్లీ, నవంబర్ 10: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ అవలంబిస్తారని భావిస్తున్న విధానాలు భారత్‌కు గణనీయమైన ప్రయోజనాన్నే చేకూరుస్తాయని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. చైనా దిగుమతులపై టారీఫ్‌ల పెంపుతో పాటు ఆ దేశపు కీలక రంగాల్లో పెట్టుబడులపై ట్రంప్ నియంత్రణలు విధించనున్నందున చైనా నుంచి పెట్టుబడులు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఇతర దేశాలకు మళ్లుతాయని మూడీస్ వివరించింది.
భారత్, ఇతర ఏషియన్ దేశాలకు కొత్త అవకాశాలు లభిస్తాయ ని మూడీస్ అంచనాల్లో పేర్కొంది. ట్రంప్ యంత్రాంగం పలు ద్రవ్య, వాణిజ్య, క్లుమైట్, ఇమ్మిగ్రేషన్ విధానాలను మారుస్తుందని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. అలాగే కార్పొరేట్ ట్యాక్స్‌ల తగ్గింపు, వ్యక్తిగత ఆదాయపు పన్నులో ఊరట వంటి ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలను ట్రంప్ అమలు చేస్తారని తెలిపింది.