calender_icon.png 18 January, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ శాంతి సందేశం

18-01-2025 01:04:27 AM

జిన్‌పింగ్‌తో చర్చించిన ట్రంప్

వాషింగ్టన్, జనవరి 17: అమెరికా అధ్యక్షుడిగా 20న ప్రమాణస్వీకారం చేయను న్నడోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకరానికి ముం దే బాధ్యతలు స్వీకరించినట్లు కనిపిస్తోంది. శుక్రవారం రోజు ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో పలు అంశాల గురించి చర్చించారు.

ఈ విషయాన్ని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తెలిపారు. అనేక అంశాల గురించి తమ మధ్య చర్చ జరిగిందని ఆయన వివరించారు. ఈ పరిణామం చైనాతో పాటు అమెరికా అభివృద్ధికి కూడా దోహదపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.