calender_icon.png 27 October, 2024 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమల ప్రచారంలో ట్రంప్ సేన హల్‌చల్

27-10-2024 12:00:00 AM

వాషింగ్టన్, అక్టోబర్ 26: త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డెమోక్రాటిక్ అభ్యర్థి కమలాహారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా తాజాగా టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో జరిగిన ర్యాలీలో హారిస్ పాల్గొన్నారు. హ్యూస్టన్‌లో రిపబ్లిన్ పార్టీ మద్దతుదారులు అధికంగా ఉండటంతో హారిస్ ర్యాలీకి ఇబ్బందులు తలెత్తాయి. కమలా ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న తరుణంలో ట్రంప్ మద్దతుదారులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆందోళనలు సృష్టించారు. వారి చర్యలతో అవాక్కైన హారిస్.. ‘వీరందరినీ వీధుల్లో నిర్వహించే చిన్నచిన్న ర్యాలీలకు పంపించండి. అది వారికి సరదాగా ఉంటుంది. కొందరికి పెద్దగా దిశానిర్దేశాలు ఏమీ ఉండవు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో డెమోక్రాట్లు హారిస్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ ఆందోళనకారులను అక్కడి నుంచి పంపేశారు.