31-03-2025 12:02:47 AM
అణు ఒప్పందం చేసుకోకపోతే బాంబు దాడులు..
అగ్రరాజ్యం చర్చల ఆహ్వానం తిరస్కరించింది: ఇరాన్ అధ్యక్షుడు..
వాషింగ్టన్: అమెరికాతో అణ్వాయుధ ఒప్పందం కుదుర్చుకోని పక్షంలో ఇరాన్ మీద బాంబు దాడులకు కూడా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే అణు ఒప్పందం గురించి అగ్రరాజ్యం అమెరికా ప్రత్యక్ష చర్చల ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వెల్లడించారు. కానీ ట్రంప్ ఈ విధంగా హెచ్చరించడంతో ఏం జరుగుతుందో తెలియక అంతా గందరగోళానికి గురవుతున్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. ‘అణుఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ నిరాకరిస్తే.. బాంబు దాడులు తప్పవు. ఇరాన్ ఊహించని రీతిలో, ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ దాడులు జరుగుతాయి. మరిన్ని ఆంక్షలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ మొదటి సారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఇరాన్‌తో సంబంధాలు అంతంత మాత్రంగానే కొనసాగాయి.