- మీ ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయండి
- లేదంటే అధిక సుంకం తప్పదు
- వర్చువల్‌గా డబ్ల్యూఈఎఫ్‌లో పాల్గొని హెచ్చరికలు
వాషింగ్టన్, జనవరి 23: అమెరికాలో ఉత్పాదక కార్యకలాపాలను ప్రారంభించాలని పారిశ్రామికవేత్తలకు అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ పిలుపినిచ్చారు. లేదంటే అధిక సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్)లో ట్రంప్ గురువారం వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. అమెరికాలో తయా రీ యూనిట్లను నెలకొల్పాలని సూచిం చారు. మీ వస్తువులను ఎక్కడ తయ రు చేసుకుంటారనేది మీ ఇష్టంపై ఆధారపడి ఉన్నప్పటికీ అమెరికాలో ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పకపోతే అధిక పన్నులు చెల్లించాల్సి ఉంటుం దనని స్పష్టం చేశారు.
అంతకుముందు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి చైనా వస్తువులపై 10శాతం అధిక సంకాలను విధించనున్నట్టు ప్రకటించారు. ఫెంటాల్ డ్రగ్‌ను మెక్సికో, కెనడాలకు చైనా తరలిస్తోందని అన్నారు. దీని ఆధారంగా చైనాపై 10శాతం అదనపు సుంకాలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.