వాషింగ్టన్, జనవరి 25: గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు విక్రయించాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్ను ఫోన్ కాల్లో బెదిరించారని, లేదంటే ఆ దేశంపై సుంకాల భారం మోపుతామని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు అనేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా కొనుగోలు చేస్తుందని ఇప్పటికే ట్రంప్ అనేకసార్లు బహిరంగ వేదికలపై ప్రకటించిన నేపథ్యంలో ఆ కథనాలు నిజమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు దేశాల అధినేతల మధ్య సుమారు 45 నిమిషాల సంభాషణ జరిగిందని, ఈ క్రమంలో ట్రంప్ తీవ్రస్వరంతో డెన్మార్క్ ప్రధానిని బెదిరించారని వార్త సంస్థలు రాసుకొస్తున్నాయి.
గ్రీన్‌ల్యాండ్ అమ్మకాన్ని డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్ తోసిపుచ్చారని అక్కడి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ ఫోన్‌కాల్ తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని వెల్లడిస్తున్నాయి.