calender_icon.png 28 November, 2024 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ టారీఫ్‌ల ఎఫెక్ట్ ఇండియాపై తక్కువే

28-11-2024 12:00:00 AM

మోర్గాన్ స్టాన్లీ విశ్లేషణ

  1. చైనాపై టారీఫ్‌లు మరింత పెంచుతాం
  2. కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకాలు వేస్తాం
  3. ట్రంప్ తాజా బెదిరింపు

న్యూఢిల్లీ, నవంబర్ 27: అమెరికాలోకి దిగుమతయ్యే ఉత్పత్తులపై పెద్ద ఎత్తున సుంకాల్ని విధిస్తానంటూ యూఎస్ ప్రెసి డెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు ఇండియాకు పెద్ద సమస్య కాదని, ట్రంప్ టారీఫ్‌లతో భారత్, జపాన్‌లపై తక్కువ ప్రభావం పడుతుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ విశ్లేషించింది.

ట్రంప్ టారీఫ్‌ల బెడద జపాన్‌కు ఏమాత్రం ఉండదని, భారత్ ఆర్థి కాభివృద్ధిని కొంతమేర ప్రభావితం చేయవ చ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. అయి తే ఆసియా ప్రాంతంపై విస్త్రతమైన ప్రభావం పడవచ్చని, వీటిని ఎదుర్కోవడానికి ఈ ప్రాంత దేశాలు వివిధీకరించిన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ వివరిం చింది.

జపాన్ ఉత్పత్తులను రీప్లేస్ చేయడం వీలుకానందున 70 శాతం జపాన్ ఉత్ప త్తులకు యూఎస్ టారీఫ్‌ల నుంచి మినహా యింపు ఉన్నదని, అందుచేత యూఎస్ టారీఫ్ పాలసీల ప్రభావం ఆ దేశంపై ఉండదని పేర్కొంది. 

భారత్ అధిక సుంకా ల్ని విధిస్తున్నదంటూ ట్రంప్ ఇటీవల చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో) గణాంకాల ప్రకా రం 2022లో యూఎస్ ఉత్పత్తులపై భారత్ 9.5 శాతం టారీఫ్‌లను పెంచిందని, అటు తర్వాత యూఎస్ ఎగుమతి చేసే యాపిల్స్, ఇతర వ్యవసాయోత్పత్తులపై తిరిగి సుంకా ల్ని తగ్గించిందని వివరించింది.

అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల ప్రచారంలోనే చైనా ఉత్పత్తులపై 60 శాతం టారీఫ్‌లు విధిస్తానంటూ ట్రంప్ హెచ్చరిం చిన సంగతి తెలిసిందే. అలాగే భారత్‌లోకి దిగుమతయ్యే యూఎస్ మోటారుసైకిళ్లపై భారీ సుంకాల్ని వేస్తున్నందున, తాము కూడా ఇండియా ఉత్పత్తులపై టారీఫ్‌లు పెంచుతామని కూడా ట్రంప్ బెదిరిస్తూ వచ్చారు.

తాజాగా మరో అడుగు ముందుకేసిన ట్రంప్ చైనా ప్రతిపాదిత టారీ ఫ్‌లను పెంచుతామని, మరిన్ని దేశాల నుం చి దిగుమతయ్యే ఉత్పత్తులపై సుంకాలు వేస్తామని హెచ్చరించారు.

చైనాపై టారీఫ్ లను గతంలో ప్రకటించిన 60 శాతానికి అదనంగా మరో 10 శాతం పెంచుతానని, మెక్సికో, కెనడాలపై 25 శాతం టారీఫ్‌లను విధిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. దీనితో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం మొదలువుతున్న భయా లు ఫైనాన్షియల్ మార్కెట్లలో ఏర్పడ్డాయి. 

10 శాతం టారీఫ్‌లు పెంచితే భారత్ జీడీపీ వృద్ధి 0.3 శాతం తగ్గుతుంది

భారత్ ఉత్పత్తులపై యూఎస్ టారీ ఫ్‌లను 10 శాతం పెంచితే జీడీపీ 30 బేసి స్ పాయింట్లు (0.3 శాతం) తగ్గుతుం దని అంచనా వేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ ఇండి యా చీఫ్ ఎకానమిస్ట్ ఉపాసన ఛచ్రా తెలి పారు. ట్రంప్ తాజా బెదిరింపుల ప్రకారం చైనా, కెనడా, మెక్సికోలపై టారీఫ్‌ల విధిం పుతో పలు ఆయిల్ అండ్ గ్యాస్, తయా రీ, వ్యవసాయ తదితర రంగాలపై ప్రభా వం పడి, అంతర్జాతీయంగా సరఫరా సమస్యలు తలెత్తుతాయని, దీంతో చైనా యే కాకుండా ప్రపంచంలో కీలకమైన ఆర్థిక వ్యవస్థలకు ముప్పు కలుగుతుందని మోర్గాన్ స్టాన్లీ హెచ్చరించింది.