న్యూఢిల్లీ, నవంబర్ 9: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్‌తో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఫోన్‌లో మాట్లాడా రు. హమాస్ మధ్య యు ద్ధం నేపథ్యంలో గాజాలో అనేకమంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో న్యాయమైన శాంతి కోసం పనిచేస్తామని మహ్మద్ ట్రంప్‌తో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ‘అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సమ గ్రమైన శాంతిని సాధించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో కలిసి పని చేయడానికి అబ్బాస్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ట్రంప్ సైతం యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శాంతిని నెలకొల్పేందుకు కలిసి పనిచేస్తానని ట్రంప్ పేర్కొన్నారు’ అని అబ్బా స్ కార్యాలయం తెలిపింది.