calender_icon.png 15 March, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు మెట్లెక్కిన ట్రంప్

15-03-2025 12:26:56 AM

  • జన్మతఃపౌరసత్వం రద్దుపై సుప్రీంకు అమెరికా అధ్యక్షుడు 

అధ్యక్షుడి ఆదేశాలపై స్టే విధించిన కింది కోర్టులు

వాషింగ్టన్, మార్చి 14: జన్మతః పౌరసత్వం రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను కింది కోర్టులు నిలిపివేశాయి. దీంతో ఆయన సుప్రీం గడప తొక్కారు.  ఇప్పటికే మేరీలాండ్, మసాచు  వాషింగ్టన్ జిల్లా జడ్జిలు ఈ ఆదే  నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయ  ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై కోర్టులు ఎన్ని ఆంక్షలు విధించినా కానీ ట్రంప్ మాత్రం నిర్ణయాల అమలుకే మొగ్గు చూపుతున్నారు.

ఈ ఆదేశాలపై కొన్ని కోర్టులు జారీ చేసిన ఇంజెక్షన్ ఆర్డర్లను సవాల్ చేస్తూ ఆయన సుప్రీం తలుపుతట్టారు. ఈ నిషేధాలను వ్యక్తిగత స్థాయికే వర్తింపచేలా చూడాలని సుప్రీంలో ట్రంప్ వర్గం వాదించినట్లు సమాచారం. రెండోసారి అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు స్వీకరించిన వెంటనే ట్రంప్ జన్మతఃపౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.

కాగా ఈ ఆర్డర్ ఫిబ్రవరి 19 నుంచి అమల్లోకి వచ్చినా అమెరికాలోని అనేక ఫెడరల్ కోర్టుల జడ్జిలు ఈ ఆదేశాలను తప్పుబట్టారు. ట్రంప్ చెప్పిన విధంగా జన్మతఃపౌరసత్వాన్ని రద్దు చేయాలంటే అమెరికా రాజ్యాంగానికి సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. అమెరికన్లు కాకపోయినా తమ పిల్లలకు అమెరికాలో జన్మనిస్తే ఆ దేశ పౌరసత్వం లభించేది.

దానినే ట్రంప్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రీన్ కార్డు ఉన్నా కానీ గ్రీన్ కార్డు పొందిన వారు కూడా అమెరికాలో ఎప్పటికి ఉండే అవకాశం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ పేర్కొన్నారు. ‘గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన అగ్రరాజ్యంలో ఎల్లవేళలా ఉండే అవకాశం లేదు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన ఆంశం. ఒక వేళ ఎవరైనా గ్రీన్ కార్డు హోల్డర్‌ని నేను ఉంచాలని అనుకున్నా కానీ అతడు అమెరికాలో నిరవధికంగా ఉండేందుకు వీలు లేదు.

అమెరికాలో ఎవరు ఉండాలో మేమే నిర్ణయిస్తాం’ అని పేర్కొన్నారు. కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి బహిష్కరణ గురించి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనా అనుకూల నినాదాలు చేయడంతో మహ్మద్ ఖలీల్ అనే కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థిని దేశం నుంచి పంపించేశారు. ‘’ అన్నారు.