- యూరోపియన్ యూనియన్‌పై సుంకాల విధింపు తప్పదని హెచ్చరిక
- మెక్సికోలో మాత్రం సుంకాల అమలు నెలపాటు నిలిపివేత
వాషింగ్టన్, ఫిబ్రవరి 3: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంతపని చేస్తున్నారు. ముందునుంచి హెచ్చరిస్తున్న ట్టుగానే పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా లతో పాటు చైనాపై సుంకాల కొరడా ఝళి పించారు. దీంతో భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపినట్టయింది.
మిత్రదేశా లైన కెనడా, మెక్సికో నుంచి అమెరికా దిగుమతి చేసు కునే ఉత్పత్తులపై 25శాతం చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తు లపై 10శాతం సుంకం విధిస్తూ తాజాగా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అమెరికాలోకి ఫెంటానిల్(దీన్ని తీవ్రమైన నొప్పికి చికిత్స చేయడానికి వాడుతారు.
హెరాయిన్, కొకైన్ వంటి డ్రగ్స్‌లో కలుపు తారు) అక్రమ రవా ణాను, అక్రమ వలస లను అడ్డుకునేందుకే తాను ఈ చర్యకు దిగినట్టు ప్రకటించారు. అయితే మూడు దేశాలు సైతం అదేస్థా యిలో ప్రతిఘ టిస్తున్నాయి. అమెరికాపై తా మూ సుంకాలు విధిస్తామని ప్రకటించాయి.
సాయానికి ఇదేనా ప్రతిఫలం: ట్రూడో
ట్రంప్ విధించిన సుంకాలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విచారం వ్యక్తం చేశా రు. అఫ్గనిస్తాన్‌లో అమెరికా సేనలకు మద్ద తుగా తమ దేశ బలగాలూ పోరాడాయని, అలాగే కార్చిచ్చులు, హరికేన్ల ప్రభావంతో అమెరికా ఇబ్బందులు పడినప్పుడు తాము అండగా నిలిచామన్నారు.
తాము చేసిన సాయానికి అమెరికా ప్రతిఫలం ఇదేనా? అని ప్రశ్నించారు. తమపై అమెరికా సుం కాలు విధించినట్టుగానే తాము కూడా సుం కాలు విధిస్తామన్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహల్, పండ్లు సహా 15,500 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై తాము కూడా 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించారు.
యూరోపియన్ యూనియన్‌పై కూడా..
యూరోపియన్ యూనియన్‌పై కచ్చితం గా సుంకాలు విధిస్తానని ట్రంప్ ప్రకటిం చారు. 27 దేశాల ఈయూపై టారిఫ్‌లను పరిశీలిస్తున్నారా? అని ఓవల్ కార్యాల యంలో మీడియా ప్రశ్నించగా.. కచ్చితంగా ఈయూపై సుంకాలు విధిస్తామని, ఈయూ తమతో చాలా భయంకరంగా వ్యవహ రించిందన్నారు.
2018లో స్టీల్, అల్యూమి నియం ఎగుమతులపై సుంకాలను విధించ డంతో వాణిజ్య యుద్ధానికి తెరతీసిం దన్నారు. దీనిపై ఈయూ కూడా దీటుగా స్పందించింది. తమ వస్తువులపై అన్యా యంగా లేదా ఏకపక్షంగా సుంకాలు విధించే ఏ వ్యాపార భాగస్వామికైనా ఈయూ అంతే ధృఢంగా ప్రతిస్పందిస్తుంది అని స్పష్టం చేసింది.
మెక్సికోలో నెల ఆలస్యం..
మెక్సికన్ వస్తువులపై అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాల అమ లును ఒక నెలపాటు నిలిపివేయ డానికి ఆ దేశం అంగీకరించినట్టు మె క్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బా మ్ సోమవారం ప్రకటించారు. ట్రం ప్‌తో షీన్‌బామ్ మాట్లాడిన తర్వాత ఫెంటానిల్‌పై ప్రత్యేక దృష్టి సారించి యూఎస్‌లోకి అక్రమ మాదక ద్ర వ్యాల ప్రవాహాన్ని అరికట్టడానికి మె క్సికో వెంటనే 10,000 మంది నేష నల్ గార్డ్ సైనికులను ఉత్తర సరి హ ద్దులో మోహరించనున్నారు.
ఆందోళన అవసరం లేదు: నిర్మలా సీతారామన్
అమెరికా వాణిజ్య యుద్ధంపై భారత్ ఎలాంటి ఆందోళన చెందడం లేదని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. భారత్ తయారీ కేంద్రంగా ఉండాలని కోరుకుంటున్నామని, సేవల రంగంలో బలంగా ఉన్నామన్నారు. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉందన్నారు. అయితే ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌ల వల్ల పరోక్షంగా భారత్‌పై ప్రభావం ఉండొచ్చని, అది ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేమన్నారు. ప్రస్తుత పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నామన్నారు.