calender_icon.png 10 October, 2024 | 12:56 PM

పుతిన్‌కు ట్రంప్ సీక్రెట్ కాల్స్

10-10-2024 01:11:15 AM

‘వార్’ పుస్తకంలో వెల్లడించిన జర్నలిస్ట్ ఉడ్‌వర్డ్

న్యూయార్క్, అక్టోబర్ 9: మరికొన్ని రోజుల్లో యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గురించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్ష పదవి నుం చి దిగిపోయిన తర్వాత ట్రంప్.. సీక్రెట్‌గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టచ్ లో ఉన్నట్లు తెలిసింది.

ఈ విషయాన్ని యూ ఎస్‌కు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్ట్ బాబ్ ఉడ్‌వర్డ్ తాను రాసిన ‘వార్’ పుస్తకంలో వెల్లడించారు. ఈ పుస్తకం అక్టోబర్ 15న విడు దల కానుంది. ఈ పుస్తకంలోని ముఖ్యాంశాలను అమెరికా మీడియా సంస్థలు తమ కథనాల్లో ప్రచురించాయి.

2024 ఆరంభంలో ట్రంప్ తన ఫ్లోరిడా ఎస్టేట్ నుంచి పుతిన్‌తో సీక్రెట్‌గా ఫోన్‌కాల్ మాట్లాడినట్లు బాబ్ తన పుస్తకంలో వెల్లడించారు. ఆ సమయంలో గదిలో ఎవరూ ఉం డొద్దని ట్రంప్ తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు. 2021లో ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పటి నుం చి వీరిద్దరి మధ్య 7సార్లు రహస్య మంతనా లు జరిగాయని బాబ్ తన పుస్తకంలో తెలిపారు.