calender_icon.png 8 January, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ విజయంతో కాసుల వర్షం

07-12-2024 01:40:29 AM

బెట్టింగ్‌లో 50 మిలియన్ డాలర్లు గెలుచుకున్న ఫ్రెంచ్ వ్యాపారి

న్యూఢిల్లీ, నవంబర్ 7: డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఆయన మద్దతుదారులకు ఎంత లాభం చేకురుతుందో కానీ ఓ వ్యక్తిపై మాత్రం కాసుల వర్షం కురిపించింది. ఎన్నికల్లో కచ్చితంగా ట్రంప్‌నే విజయం వరిస్తుందని పందెం కాసి ఏక ంగా 50 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఫ్రెంచ్ ట్రేడర్ ఒపీనియన్ పోల్స్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా క్రిప్టో బెట్టి ంగ్ ప్లాట్‌ఫామ్ పాలిమార్కెట్‌లో ట్రంప్ పై 30 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేశారు.

ప్రస్తుతం ట్రంప్ విజయం సాధి ంచడంతో ఆయన 50 మిలియన్ డాలర్లను గెలుచుకున్నట్టు అంతర్జాతీయ మీ డియా పేర్కొంది. ఓటర్ల నాడిని అం చనా వేయడానికి ఆయన ‘నైబర్ ఎఫెక్ట్’ పద్ధతిని ఎంచుకున్నట్టు పేర్కొంది. ఈ విధానం ద్వారా ట్రంప్‌కు పడే పాపులర్ ఓట్లతోపాటు స్వింగ్ రాష్ట్రాలు ఎవరివైపు మొగ్గు చూపుతాయన్న విషయాన్ని కచ్చితంగా అంచనా వేసినట్టు తెలుస్తోంది.