calender_icon.png 18 March, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుతిన్‌తో చర్చలకు ట్రంప్ సిద్ధం

18-03-2025 12:00:00 AM

  1. నేడు ఫోన్‌కాల్ మాట్లాడనున్న ఇరుదేశాల నేతలు
  2. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు

వాషింగ్టన్, మార్చి 17: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం అమెరికా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యా అధినేత పుతిన్‌తో చర్చలు జరపడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఇరుదే శాల నేతలు ఫోన్‌కా  మాట్లాడనున్నారు.

ఇద్దరు ఫోన్‌లోనే అన్ని విషయాలు చర్చించే అవకాశ ముంది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. మరోవైపు పుతిన్‌తో చర్చలు జరపనున్నట్లు ట్రంప్ స్వయంగా పేర్కొన్నారు. ‘మేము ఆ యుద్ధానికి ముగింపు పలకాలనుకుంటున్నాం. అది జరుగుతుందో లేదో ఇప్పు డే చెప్పలేను కానీ ప్రయత్నిస్తా.

నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌కాల్ చర్చల అనంతరం ఈ అంశం కొలిక్కి రానుంది’ అని ట్రంప్  వెల్లడించారు. యుద్ధం ముగింపు అంశంతో పా టు ఇరుదేశాల మధ్య ద్వై పాక్షిక ఒప్పందాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే భూమి, పవర్ ప్లాం ట్ల గురించి చర్చకు రానున్నట్లు సమాచారం.

ఇటీవలే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ట్రంప్ సమావేశం రసాభాసగా మారింది. అయితే తాను ఆ విధంగా ప్రవర్తించి ఉండకూడదని.. అమెరికా అధ్యక్షుడిని క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ ప్రజలు యుద్ధం ముగింపు కోసం ఎదురు చూస్తున్నారని, నివారించడానికి చర్యలు తీసుకోవాలని అమెరికాను కోరారు.