calender_icon.png 6 March, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ పిటిషన్ కొట్టివేత

06-03-2025 01:01:47 AM

యూఎస్‌ఎయిడ్ నిధులను ఆపొద్దన్న ధర్మాసనం

వాషింగ్టన్, మార్చి 5: రెండు బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ సాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన పిటిషన్‌ను అమెరికా సుప్రీం కోర్టు కొట్టేసింది. మానవతా సాయం నిలిపివేతపై కింద కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వాషింగ్టన్‌లో ఉన్న సుప్రీం కోర్టు సమర్థించింది.

ట్రంప్ నిర్ణయంతో రెండు బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీసాయం నిలిచిపోయింది. ఇప్పటికే కింది కోర్టు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేఖించింది. ఇప్పటికే ఆమోదించిన గ్రాంట్లు, చెల్లింపులను వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ ఇప్పటికే డిస్ట్రిక్ట్ జడ్జి అమీర్ అలీ ఉత్తర్వులు జారీ చేయగా..

ట్రంప్ ప్రభుత్వం ఆ ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. యూఎస్ ఎయిడ్ నిధుల వల్ల అనేక దేశాలలో అనేక సంక్షేమ కార్యక్రమా లు జరుగుతున్నాయి. ట్రంప్ నిర్ణయంతో ఆ కార్యక్రమాల అమలు నిలిచిపోయింది.