calender_icon.png 20 January, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరికొన్ని గంటల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం

20-01-2025 10:11:35 AM

వాషింగ్టన్: డోనాల్డ్ ట్రంప్(donald trump) ప్రమాణస్వీకార కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. డోనాల్డ్ ట్రంప్ సోమవారం యునైటెడ్ స్టేట్స్(United Statesఅమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ట్రంప్(Trump) కూడా తన పదవికి వచ్చిన మొదటి రోజునే సరిహద్దు భద్రత నుండి చమురు, గ్యాస్ ఉత్పత్తి వరకు ఉన్న విషయాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లపై సంతకం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అమెరికా అధ్యక్షుడి(US president)గా రెండోసారి పదవీ బాధ్యతలను ప్రారంభించి, అమెరికా చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన రాజకీయ పునరాగమనంలో చరిత్ర సృష్టించారు. భారత కాలమానం ప్రకారం(According to Indian time) ఇవాళ రాత్రి 10.30 గంటలకు ట్రంప్ ప్రమాణస్వీకారం ఉండనుంది.

అతిశీతల వాతావరణం దృష్ట్యా బహిరంగప్రదేశంలో కాకుండా ఇండోర్ లో ప్రమాణం చేయనున్నారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్(Washington DC Capitol Hill) లోని రోటుండా ఇండోర్ లో ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. అమెరికా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ జాన్ రాబర్ట్ ట్రంప్ తో ప్రమాణం చేయించనున్నారు. అమెరికా ఉపాధ్యక్షునిగా జేడీ వాన్స్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ట్రంప్ ప్రమాణస్వీకారం(Donald Trump Inauguration) సందర్భంగా సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పరేడ్ లు, ఉదయం సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్(St. John's Episcopal Church)చర్చిలో డొనాల్డ్ ట్రంప్ ప్రార్థనలు చేయనున్నారు. ప్రార్థనల తర్వాత అధ్యక్షుడు జో బైడెన్ తేనీటి విందులో ట్రంప్ పాల్గొనున్నారు. ట్రంప్ ప్రమాణస్వీకారానికి, భారత విదేశాంగ మంత్రి జైశంకర్(Subrahmanyam Jaishankar), అంబానీ దంపతులు, ఎలాన్ మస్క్(Elon Musk), మార్క్ జుకర్ బర్గ్, జెఫ్ బెజోస్, సామ్ ఆల్ట్ మన్, సుందర్ పిచాయ్(Sundar Pichai) హాజరుకానున్నారు. ప్రమాణస్వీకారం సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.