calender_icon.png 12 January, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తదుపరి అధ్యక్షుడు ట్రంపే

29-07-2024 01:59:07 AM

  1. ప్రముఖ జ్యోతిష్కురాలు అమీ ట్రిప్
  2. బైడెన్ నిష్క్రమణ తేదీని ఖచ్చితంగా చెప్పిన అమీ
  3. వైరల్ అవుతున్న పోస్టులు

న్యూ ఢిల్లీ, జూలై 28: డొనాల్డ్ ట్రంప్ తదుపరి(2024) అమెరికా అధ్యక్షుడిగా గెలుస్తార ని ప్రముఖ జ్యోతిష్కురాలు అమీ ట్రిప్ అంచనా వేశారు. అలాగే జో బైడెన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటారని, ఆగస్టు నెలలో అమెరికాలో తీవ్ర రాజకీయ సంక్షో భం ఏర్పడుతుందని ఆమె గతంలో తేదీలతో సహా వెల్లడించిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. న్యూయార్క్ పోస్టు పత్రికలో ఒక నివేదికలో ఆమె వెల్లడించిన పలు అంశా లు ఇప్పడు అగ్రరాజ్యంలో హాట్ టాపిక్‌గా మారాయి. 

యురేనస్ తన మధ్య స్వర్గంలో ఉన్నాడని ఇది ట్రంప్ కెరీర్‌లో అనూహ్య మార్పులను తీసుకువస్తుందని ట్రిప్ అంచనావేశారు. అంతకు ముందు జూలై 11న ట్రిప్ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.. ‘బైడెన్ పదవీ విరమణ చేస్తే అది మకరపౌర్ణమిలో మకరరాశిలో ఉంటుంది అన్నారు.మకరం వృద్ధాప్యా న్ని, ప్రభుత్వాన్ని శాసిస్తుందని తెలిపారు. ఒక ఫాలోవర్ ఆమెను ఖచ్చితమై తేదీని చప్పాలని కోరగా జూలై 21న బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటారని తెలిపింది. మరో పోస్టులో కమలా హారిస్ 2024 అధ్యక్ష పదవికి పోటీచేస్తారని ముందే వెల్లడించారు ట్రిప్.