calender_icon.png 18 November, 2024 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరులనూ అవమానించిన ట్రంప్

02-09-2024 12:19:13 AM

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్

వాషింగ్టన్, సెప్టెంబర్ 1: అమెరికా అధ్యక్ష అభ్యర్థులు కమలాహ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. సైనికుల మృతదేహాలను ఖననం చేసే ఆర్లింగ్టన్ జాతీయ శ్మశానంలో ట్రంప్ ఫొటోలకు ఫోజు లు ఇవ్వటంతో కమల మండిపడ్డారు. పవిత్రమైన ప్రదేశాన్ని కూడా ట్రంప్ తన ఎన్నికల ప్రచారానికి వాడుకొన్నారని విమర్శించారు. 

మీ వల్లే మా పిల్లలు చనిపోయారు

డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలపై అమెరికా అమరుల కుటుంబాలు మండిపడ్డాయి. 2021లో ఆఫ్గానిస్థాన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరిస్తున్న సమయంలో అల్‌ఖైదా బాంబు దాడిలో 13 మంది అమెరికా సైనికులు చనిపోయారు. వారి కుటుంబాలు నాడు కమలతో పాటు అధ్యక్షుడు బైడెన్‌పై మండిపడ్డాయి. అప్పటి వీడియోలను ట్రంప్ తాజాగా సోషల్‌మీడియాలో విడుదల చేసి కమలపై ఎదురు దాడికి దిగారు. 

ట్రంప్ అంటే మెలానియాకు అసహ్యం

వివాదాలతో సావాసం చేసే డొనాల్డ్ ట్రంప్‌పై ఆయన మాజీ సహాయకుడు ఆంటోనీ స్కారాముసి సంచలన విషయాలు వెల్లడించాడు. ట్రంప్‌ను చూస్తేనే ఆయన భార్య మెలానియా అసహ్యించుకొంటారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ప్రస్తుత ఎన్నికల్లో కమలనే గెలువాలని మెలానియా కోరుకొంటున్నారని బాంబు పేల్చాడు.