calender_icon.png 12 February, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ దురాకార చర్యలు.. భారత్ తిప్పి కొట్టాలి

09-02-2025 04:30:17 PM

నిర్మల్,(విజయక్రాంతి): అమెరికా దేశంలో ఉన్న వలస భారతీయులపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షల పేరుతో బేడీలు వేసి ఇండియాకు పంపడం దుర్మార్గమని దీన్ని భారత ప్రభుత్వం తిప్పి కొట్టాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నంది రామయ్య అన్నారు. ఆదివారం నిర్మల్ లో నంది రామయ్య మాట్లాడారు. అమెరికా దేశంలో వెళ్లిన భారతీయులపై ఆంక్షలు పేరుతో అవమానపరిచే విధంగా భారతదేశానికి పంపుతున్న ట్రంప్ సర్కారు చర్యను ప్రతి దేశం ఖండించాలని సూచించారు. బేడీలను నేరస్థులకు మాత్రమే వేస్తారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్న రామ్ లక్ష్మణ్ బక్కన్న గఫూర్ పాల్గొన్నారు.