11-02-2025 10:10:21 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఇజ్రాయెల్ బందీల విడుదల(Israeli Hostages Release)పై హమాస్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) డెడ్ లైన్ విధించారు. ఫిబ్రవరి 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు బందీల విడుదలకు డిమాండ్ చేస్తూ, ఇక, బందీలను విడుదల చేయకపోతే నరకం చూపిస్తానని హమాన్(Hamas)కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు పిలుపునిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్(Israel) ఉల్లంఘిస్తోందని హమాన్ ఆరోపణలు చేసింది. తదుపరి బందీల విడుదల ఆలస్యం చేస్తామని హమాస్ ప్రకటనతో ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా జనవరి 19 నుంచి ఇప్పటివరకు ఇరుపక్షాల మధ్య 5 సార్లు పరస్పరం బందీలు, పాలస్తీనీయుల విడుదల జరిగింది.
ఒప్పందంలో భాగంగా పలు దఫాలుగా 21 మందిని విడుదల చేసిన హమాన్ కు బదులుగా 730 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. తదుపరి విడుదల ప్రక్రియ శనివారానికి నిర్ణయించగా హమాస్, ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తామని ప్రకటిచింది. ఇదిలా ఉండగా మరోవైపు గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటాని ట్రంప్ చేసిన ప్రకటనపై అరబ్ దేశాలతోపాటు అమెరికా మిత్రదేశాలు కూడా అభ్యంతరం తెలిపడంతో పాటు పాలస్తీనియన్లు తిరస్కరిస్తున్నారు. ఈజిప్టు విదేశాంగశాఖ మంత్రి బాదర్ అబ్దెలాటి వారికి తము మద్దతిస్తున్నట్లు యూఎస్ విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియోకు తెలిపారు. దీనిపై స్పందించిన ట్రంప్, పాలస్తీనియన్లు నిరాకరిస్తే మిత్రదేశాలైన జోర్దాన్, ఈజిప్ట్‌లకు అందించే సహాయాన్ని నిలిపివేస్తానని హెచ్చరించారు. ఇక, ఈ వారంలో ట్రంప్‌తో జోర్దాన్ రాజు అబ్దుల్లా 2 భేటీ కానున్నట్లు పలు వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి.