వాషింగ్టన్, జనవరి 4: హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఊరట లభించింది. కేసు విచారణ జరగ్గా ట్రంప్‌నకు ఈ నెల 10న శిక్ష విధిస్తానని న్యూయార్క్ జస్టిస్ మర్చన్ ఆదేశాలు జారీచేశా రు. 20న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండడంతో ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని, జరిమానా కూడా కట్టాల్సిన పని లేకుండా “అన్‌కండిషినల్ డిశ్చార్జి’ని అమలు చేస్తామని వెల్లడించారు. ట్రంప్‌కు ఎలాంటి శిక్ష విధి ంచకూడదని ఆయన అధికార ప్రతినిధి స్టివెన్ చియుంగ్ ఒక ప్రకటనలో తెలిపారు.