calender_icon.png 22 February, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ మరో బాంబ్!

21-02-2025 12:43:08 AM

  1. ఎవర్నో గెలిపించేందుకు ప్రయత్నించారు 
  2. ఎన్నికల నిధుల ఆంశంలో బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ ఆరోపణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. భారత్‌లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా వెచ్చిస్తున్న 21 మిలియన్ డాలర్ల నిధులతో గత ప్రభుత్వం (బైడెన్ సర్కార్‌ను ఉద్దేశించి) ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిందని తెలిపారు.

దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఓటింగ్ శాతం పెంచడం కోసం మేమెందుకు 21 మిలియన్ డాలర్లివ్వాలి? బహుశా ఆ దేశంలో మరెవర్నో గెలిపించేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించిందని ఇది చూస్తే అర్థం అవుతోంది. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రభుత్వానికి తెలపాలి’ అని అన్నారు. దీంతో భారత్‌లోని రాజకీయ పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. 

మోదీ ఆనాడే చెప్పారు: బీజేపీ 

ట్రంప్ ఇలా వ్యాఖ్యానించగానే.. బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవీయ 2024 సా ధారణ ఎన్నికల సమయంలో మోదీ మాట్లాడిన వీడియోలను పంచుకుని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘మన ఎన్నికలను ఎవరో ప్రభావితం చేసేందుకు చూస్తున్నా రు. కాంగ్రెస్ వారు మరికొం త మంది కలిసి ఈ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

వారికి బలహీన ప్రభుత్వం.. ఎల్లప్పు డూ సొంత సమస్యలతో సతమతం అయ్యే ప్రభుత్వం కావాలి’. అని 2024 ఎన్నికల మీటింగ్‌లో మోదీ విమర్శించారు. ఇక అంతే కాకుం డా రాహుల్ లండన్ పర్యటనకు సంబంధించిన వీడియోను కూడా మాలవీయ పోస్ట్ చేశా రు. బీజేపీ సీనియర్ లీడర్ రవి శంకర్ ప్రసాద్ కూడా కాంగ్రెస్‌పై పలు ఆరోపణలు చేశారు. కుట్రలు చేయ డం, భారత ప్రజాస్వామ్యాన్ని కించపరచడం కాంగ్రెస్‌కు అలవాటే అన్నారు. 

వీణా రెడ్డిపై విమర్శలు..

ఈ 21 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధుల ఆంశం యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఎయిడ్)కు ఇండి యా డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించిన వీణారెడ్డి మెడకు చుట్టుకుంది. బీజేపీ ఎంపీ మహేశ్ జీత్‌మలానీ మాట్లాడుతూ.. ఈ నిధు ల గురించి వీణా రెడ్డిని విచారించాలని డి మాండ్ చేశారు. వీణా రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు.

ఆమె ఆంధ్రప్రదేశ్‌లో జన్మించినా కానీ అమెరికా కాలేజీలో విద్యనభ్యసించారు. ఆగస్టు 2021లో ఆమె యూఎస్‌ఎయిడ్ ఇండియా ఆఫీసులో జాయిన్ అయింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆమె విధుల నుంచి పక్కకు తప్పుకుంది. అమెరికా ప్రభుత్వంలో ఫారిన్ సర్వీసెస్ ఆఫీసర్‌గా జాయిన్ కాక ముందు న్యూయార్క్‌లో కార్పొరేట్  న్యాయవాదిగా విధులు నిర్వర్తించారు. 

పెరిగిన నిధుల ప్రవాహం.. 

వీణా రెడ్డి యూఎస్‌ఎయిడ్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో అమెరికా కేటాయించే నిధుల ప్రవాహం పెరిగింది. 2021లో 94.3 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న నిధులు, 2022లో 288 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇక 2024లో 151.8 మిలియన్ అమెరికన్ డాలర్లను యూఎస్ కేటాయించడం గమనార్హం. ఈ నిధులను భారత్‌లో వివిధ పనుల కోసం ఖర్చు చేశారు. 

ఈ ప్రాజెక్టు డైరెక్టర్‌గా మూ డేండ్లు విధులు నిర్వర్తించిన వీణా రెడ్డి పలురంగాల్లో వివిధ రకాల రంగాల్లో కృషి చేశారు. భూటాన్‌లో కూడా యూఎస్‌ఎయిడ్ డైరెక్టర్‌గా పని చేశారు. ఇక 2023లో భారత్‌లో జరిగిన జీఫూ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్‌లో పాల్గొన్నారు. 

శ్వేత పత్రం విడుదల చేయాలి

కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా యూఎస్‌ఎయిడ్ గురించే వినబడుతోంది. ఇది నవంబర్ 3 1961లోనే ఏర్పాటైంది. ఈ సంస్థ అందించే నిధుల గురించి ప్రభుత్వం వీలైనంత త్వరగా శ్వేత పత్రం విడుదల చేయా లి. ట్రంప్ చేస్తున్న వాదనలు అర్థరహితంగా ఉన్నాయి. యూఎస్ ఎయిడ్ ఏర్పాటు నుంచి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు అందించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.  

 జైరాం రమేశ్,

కాంగ్రెస్ మీడియా విభాగం అధిపతి