calender_icon.png 29 March, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వరం మార్చిన ట్రంప్

21-03-2025 12:27:46 AM

ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన భారత విదేశాంగ శాఖ

వాషింగ్టన్, మార్చి 20: సుంకాల విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తున్న ట్రంప్ భారత్ విషయంలో తన స్వరం మార్చారు. అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ సుంకాలను తగ్గించే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రీట్‌బాట్ న్యూస్ ఇంటర్యూలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ.. భారత్‌తో తమకు మంచి సంబంధాలున్నాయన్నారు. 

కానీ సుంకాల విషయంలోనే తమకు సమస్య ఎదురైందని పేర్కొన్నారు. అయితే భారత్ సుంకాలను గణనీయంగా తగ్గిస్తుందని అ నుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఏప్రిల్ 2 నుంచి భారత్ ఎంత టారిఫ్ విధిస్తే.. అంతే సుంకాలు భారత్‌పై విధించాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

వాణిజ్య యు ద్ధాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య పన్నుల విధానంలో కీలక మార్పులు చో టుచేసుకుంటాయన్న అంచనాల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి. ట్రంప్ తాజా వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. సుంకాల తగ్గింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భారత వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్తాల్ పేర్కొన్నారు.