వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల్లో విజయం సాధించిన రెండు రోజుల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఇరువురు నేతలు ఉక్రెయిన్‌లో పరిస్థితిపై చర్చించారని, వివాదం పెరగకుండా చూడాలని ట్రంప్ పుతిన్‌ను కోరారు. యూరప్ లో అమెరికా సైనిక సంపత్తి మోహరించిన స్థాయిని ట్రంప్ గుర్తు చేశారంటూ వార్తలొచ్చాయి. అలాగే ఉక్రెయిన్ యుద్ధానికి ఓ పరిష్కారం కనుగొందామని సూచించినట్లు సమాచారం. ఈ పరిణామాన్ని అమెరికా లేదా రష్యా ధృవీకరించలేదు. గత వారం రష్యాలోని సోచిలో జరిగిన బహిరంగ కార్యక్రమంలో అమెరికా-రష్యా సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే కోరికకు శ్రద్ధ అవసరమని పుతిన్ నొక్కిచెప్పారు. పుతిన్‌తో తన కాల్‌కు ముందు, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ ఇప్పటికే ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రిపబ్లికన్ నాయకుడు కైవ్‌కు యుఎస్ సైనిక, ఆర్థిక సహాయాన్ని విమర్శించాడు. యుద్ధాన్ని త్వరగా ముగించాలని చెప్పినట్లు సమాచారం.