అధికార మార్పిడిలో భాగంగా సమావేశమైన నేతలు
వాషింగ్టన్, నవంబర్ 13: అధికార మార్పిడి ప్రక్రియలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో బుధవారం భేటీ అయ్యారు. వాషింగ్టన్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ఇద్దరు సమావేశమయ్యారు. నేతలిద్దరూ కరచాలనం చేసుకుని జనవరి 20న అధికార మార్పిడి సాఫీగా జరిగేందుకు అంగీకరించినట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికవడం పట్ల బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. బైడెన్‌తో పాటు అమెరికా మొదటి మహిళ జిల్ బైడెన్ కూడా ట్రంప్‌కు స్వాగతం పలికారు. ఎన్నికల అనంతరం అధ్యక్షుడితో ప్రెసిడెంట్ ఎలక్ట్ భేటీ కావడం సంప్రదాయంగా వస్తోంది.