calender_icon.png 25 October, 2024 | 7:05 AM

ట్రంప్ అసభ్యకరంగా ప్రవర్తించారు

25-10-2024 02:27:37 AM

మాజీ మోడల్ స్టాసీ విలియమ్స్ ఆరోపణ

వాషింగ్టన్, అక్టోబర్ 24: రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓ సం దర్భంలో తనతో అస్యభకరంగా ప్రవర్తించారని అమెరికా మాజీ మోడల్ స్టాపీ విలియమ్స్ ఆరోపించారు. ఆ మేరకు ప్రముఖ మీడియా సంస్థ ది గార్డియన్ కథనాన్ని ప్రచురించింది. ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో స్టాసీ విలియమ్స్ డేటింగ్‌లో ఉంది.

అదే సమయంలో జెఫ్రీ ఓ పార్టీలో ట్రంప్‌కు విలియమ్స్‌ను పరిచయం చేశాడు. ‘కొన్ని రోజుల తర్వాత ఓ రోజు జెఫ్రీ నన్ను న్యూయార్క్‌లో ఉన్న ట్రంప్ ఆఫీస్‌కు తీసుకెళ్లాడు. నన్ను చూసి వాళ్లి ద్దరూ నవ్వుకున్నారు. అదే సమయంలో ట్రంప్ నన్ను తనవైపునకు లాక్కొని చాలా అసభ్యకరంగా తాకా రు’ అని కమలాహారిస్ ప్రచార బృం దానికి ఈ విషయాన్ని ఆమె తెలియజేసినట్లు కథనం పేర్కొంది.

ట్రంప్ అనేక మంది మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపించారు. కాగా ట్రంప్ ప్రచార బృందం ఇంద తా కట్టుకథ అని కొట్టిపారేసింది. కాగా ట్రంప్ ఇది వరకు పలు లైంగిక వేధింపుల కేసుల్లో దోషిగా తేలిన సంగతి తెలిసిందే. శృంగార తార స్టార్మీ డేనియల్‌తో ఏకాంతంగా గడపడం, అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కారొల్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయన దోషిగా తేలారు.