calender_icon.png 17 January, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్

17-07-2024 06:35:55 AM

  • అధికారికంగా ప్రకటించిన పార్టీ 
  • ఉపాధ్యక్షుడిగా వాన్స్‌ను ప్రతిపాదించిన ట్రంప్

వాషింగ్టన్, జూలై 16: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిరన్ అభ్యర్థిగా ట్రంప్‌ను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి అంగీకారం తెలిపారు. చెవికి బుల్లెట్ గాయమైన ట్రంప్ రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సుకు బ్యాండేజీతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు పార్టీ సభ్యుల నుంచి ఘన స్వాగతం లభించింది. రెండ్రోజుల క్రిత ం ట్రంప్ త్రుటిలో మృత్యువు నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఘటన తర్వాత తొలిసారి ఓ సభకు ట్రంప్ హాజరయ్యారు. సభకు ట్రంప్ రాగానే సభ్యు లంతా హర్షధ్వానాలు చేశారు. ఆయన పేరు తో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశా రు. ఆడిటోరియంలోకి ట్రంప్ ప్రవేశించగానే సింగర్ లీ గ్రీన్‌ఉడ్.. గ్లాడ్ బ్లెస్ ద యూఎస్‌ఏ అని ఆలపించారు. ఇదే సభలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనేటర్ జేడీ వాన్స్‌ను ట్రంప్ ప్రకటించారు. ఎంతో ఆలోచించి మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించిన వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకున్నామని ట్రంప్ తెలిపారు. వాన్స్ సైనికుడు మాత్రమే కాదని, ఉన్నత విద్యను అభ్యసించారని తెలిపారు. ఆయన రాసిన హిల్‌బిల్లీ ఎలెజీ అనే పుస్తకం ఆధారంగా సినిమా సైత ం రూపొందించినట్లు గుర్తు చేశారు. 

అదృష్టంతోనే బయటపడ్డా

శనివారం జరిగిన కాల్పుల ఘటనలో దాదాపు చనిపోయాయనే భావించినటు..్ల అదృష్టమో, దేవుడి కృప కారణంగానో బతికి బయటపడ్డానని ట్రంప్ వెల్లడించారు. మి ల్వాకీలో జరిగే రిపబ్లికన్ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వెళుతుండగా ఓ జాతీయ మీడియాతో ట్రంప్ మాట్లాడారు. కాల్పుల తర్వాత మీ అందరి ముందుకు వస్తాననుకోలేదు. ఆ ఘటనలో చనిపోవాల్సిన వాడినే. ఇదొక చిత్రమైన పరిస్థితి. అమెరికాలో ఇలాంటి దాడి జరగడం ఆశ్చర్యకరం. నేను మాట్లాడుతూ తల తిప్పడమే నన్ను కాపాడింది. లేదంటే ఆ బుల్లెట్ నన్ను మట్టుబెట్టేదే. నాకు చికిత్స చేసిన వైద్యుడు కూడా ఇదే మాట చెప్పారు అని ట్రంప్ వివరించారు. 

వాడు రాక్షసుడు

ట్రంప్‌పై దాడి చేసిన వ్యక్తిని రాక్షసుడితో పోల్చారు ఆయన సతీమణి మెలానియా ట్రంప్. ఆయన ప్రాణాలు కాపాడిన భద్రతా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.  

ట్రంప్‌కు అన్ని మంచి శకునాలే

రహస్య పత్రాలకు సంబంధించి కేసును ఎదుర్కొంటున్న ట్రంప్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. కేసును ఫ్లోరిడా న్యాయస్థానం కొట్టివేసింది. అభియోగాలు దాఖలు చేసిన ప్రత్యేక న్యాయవాదిని చట్టవిరుద్ధంగా నియమించారని ట్రంప్ న్యాయవాది చేసిన వాదనతో ఏకీభవించింది. నే రాభియోగాలపై విచారణ నుంచి అధ్యక్షు లుగా పనిచేసిన వారికి మినహాయిం పు ఉంటుందని తెలిపింది. 

సారీ ట్రంప్..

ట్రంప్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్షమాపణలు చెప్పారు. ఇక నుంచి ట్రంప్‌పై దృష్టి సారించాల్సిన అవసరముందనే అర్థం వచ్చేలా బైడెన్ ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలే ట్రంప్‌పై కాల్పులకు ఉసిగొల్పాయంటూ పలువురు ఆరోపి స్తున్నారు. పరోక్షంగా ఇది హత్యాయత్నమేనని తీవ్రస్థాయిలో మండిప డ్డారు. దీనిపై బైడెన్ స్పందిస్తూ.. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకోవాలన్నది పొరపాటేనని, అయితే ఆయనపై దా డి చేయాలనడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ట్రంప్ ఇప్పటికీ ప్రజాస్వామ్యానికి ముప్పేనని తెలిపారు.