క్రెమ్లిన్ స్పష్టం
మాస్కో, నవంబర్ 11: జనవరిలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిచంనున్న ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఇటీవల ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని రష్యా అధ్యక్ష కార్యా లయం క్రెమ్లిన్ ప్రకటన చేసింది. ఉక్రెయిన్ యుద్ధంపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు ఇటీవల వాషింగ్టన్ పోస్ట్ లో వెలువడిన కథనం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ఇవి పూర్తిగా కల్పి తమని, తప్పుడు సమాచారం అని స్పష్టం చేశారు. ఇద్దరు నేతల మధ్య చర్చల కోసం ప్రస్తుతానికి ఎలాంటి ప్లాన్లు లేవని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్ర పెస్కోవ్ మీడియాకు స్పష్టం చేశారు.