16-04-2025 01:01:07 AM
ప్రభుత్వ ఆదేశాల ధిక్కరణ నేపథ్యంలో చర్యలు
2.3 బిలియన్ డాలర్ల నిధులు నిలిపివేత
యూనివర్సిటీకి ఒబామా మద్దతు
వాషింగ్టన్, ఏప్రిల్ 15: అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీకి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం షాకిచ్చింది. తన ఆదేశాలు పాటించలేదనే కారణంతో యూనివర్సిటీకి అందాల్సిన 2.3 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను స్తంభింప చేసింది. అలాగే, 60 మిలియన్ డాలర్ల ఫెడరల్ కాంట్రాక్టులను నిలిపి వేసింది. యూనివర్సిటీలో నియామక పద్ధతులు, ప్రవేశ విధానాల్లో మార్పులు చేయాలని, ఫేస్ మాస్కులను నిషేధించాలని ఇటీవల ఓ లేఖ ద్వారా ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీ యాజమాన్యానికి తెలిపింది.
అలాగే, తన వైవిధ్య కార్యక్రమాలను సమీక్షీంచడంతోపాటు కొన్ని విద్యార్థి క్లబ్‌ల గుర్తింపును నిలిపివేయాలని యూనివర్సిటీకి సూచించింది. ఇవి అమలు చేయకపోతే నిధుల్లో కోత తప్పదని ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్ యూనివర్సిటీని హెచ్చరించింది. పాలస్తీనా అనుకూల నిరసనలను అణచివేసేందుకే ట్రంప్ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే, ప్రభుత్వ ఆదేశాలను హార్వర్ యూనివర్సిటీ ఖండించింది. ‘యూనివర్సిటీ తన స్వతంత్రాన్ని, రాజ్యాంగ హక్కులను వదులుకోదు.
ప్రైవేటు యూనివర్సిటీలు ఏమి బోధించాలి, ఎవరికి ప్రవేశం కల్పించాలి, ఎవరిని నియమించుకోవాలి, ఏయే రంగాలను అధ్యయ నం కోసం ఎంచుకోవాలి అనే విషయాలను పార్టీలతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వమూ నిర్దేశించకూడదు’ అని ట్రంప్ ప్రభు త్వానికి రాసిన లేఖలో యూనివర్సిటీ ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ స్పష్టం చేశారు. గార్బ ర్ లేఖ రాసిన గంటల వ్యవధిలోనే యూనివర్సిటీకి నిధులు నిలిపి వేస్తూ ట్రంప్ సర్కా ర్ నిర్ణయం తీసుకుంది.
యూనివర్సిటీని సమర్థించిన ఒబామా
విద్యా స్వేచ్ఛను అణచివేయడానికి జరిగిన చట్టవిరుద్ధమైన చర్యను తిరస్కరించడం ద్వారా ఇతర విద్యా సంస్థలకు హార్వర్డ్ యూనివర్సిటీ ఆదర్శంగా నిలిచిందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ఇతర విద్యా సంస్థలు కూడా హార్వర్డ్ బాటలోనే నడుస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. కాగా, అమెరికాలోని ఇతర యూనివర్సిటీల పై కూడా ట్రంప్ ప్రభుత్వం ఇదే తరహా ఒత్తి డి చేస్తోంది. విశ్వవిద్యాయాల్లో పరిశోధనలకు ఫెడరల్ నిధులు అ త్యంత ఆవశ్యకం. నిధులను నిలిపివేయ డం వల్ల పరిశోధనలకు ఆటంకం ఏర్పడనుంది.