calender_icon.png 17 October, 2024 | 3:55 AM

‘నిజమైన దేవుడు’ రతన్ టాటా

17-10-2024 01:06:55 AM

ఛాతీపై రతన్ టాటా టాటూ వేయించుకున్న అభిమాని

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఓ అభిమాని తన ఛాతీపై దివంగత పారశ్రామిక వేత్త రతన్ టాటా టాటూను వేయించుకున్న ఓ వీడి యో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. వీడియోలో ఆ వ్యక్తి మాట్లాడుతూ.. రతన్ టాటా ను నిజ జీవిత దేవుడిగా అభివర్ణించాడు. కొన్నేళ్ల క్రితం తన స్నేహితుడు క్యాన్సర్‌తో భాదపడుతుండగా.. పెద ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు ప్రయత్నించామని.. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న ఆ సమయంలో టాటా ట్రస్ట్ వారు తన స్నేహితుడికి ఉచిత చికిత్స చేయించి అతడి ప్రాణాలను నిలబెట్టారని చెప్పుకొచ్చాడు.

ఇలా కేవలం తన స్నేహితుడి జీవితం మాత్రమే కాకుండా అనేకమంది జీవితాలను టాటా ట్రస్టు కాపాడింది అని అతడు కన్నీటి పర్యం తమయ్యాడు. అందుకే నేను రతన్ టాటాను నిజ జీవిత దేవుడిగా చూస్తానని చెప్పాడు. భారతదేశం ఓ లెజెండ్‌ను కోల్పోయిందని క్యాప్షన్ పెట్టి.. ఇన్‌స్టాలో అతడు షేర్ చేసిన ట్యాటూ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 10 లక్షల లైక్‌లు రాగా, 80 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ జీరో హేటర్స్ ఉన్న వ్యక్తి రతన్ టాటా’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘మేము నిజమైన కోహినూర్‌ను కోల్పో యాం’, ‘రతన్ టాటాకి భారత రత్న ఇవ్వా లి’, ‘ద ట్రూ ఇండియన్ రతన్ టాటా’ అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.