ఎన్డీపీ నేత జగ్మీత్‌సింగ్ డిమాండ్
ఒట్టావా, డిసెంబర్ 17: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత, ఖలీస్థానీ వేర్పాటువాద మద్దతుదారు జగ్మీత్‌సింగ్ డిమాండ్ చేశారు. ట్రూడో సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తామని సింగ్ ప్రకటించారు. దీంతో ట్రూడో భవితవ్యం డోలాయమానంలో ప డింది.
ఇన్నాళ్లు ఎన్డీపీ పార్టీ మద్దతు ఇవ్వడంతో ట్రూడో పదవిలో కొనసాగుతున్నారు. ఒట్టావాలో జగ్మీత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. కెనడాలో ఇళ్లు, నిత్యవసరాల ధరలు పెరగడం, దిగుమతులపై భారీ సుంకా లు విధిస్తానని ట్రంప్ హెచ్చరించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా తమ సొంత వ్యవహారాల్లో లిబరల్స్ మునిగి తేలుతున్నా రని ఆయన ఆరోపించారు.